మెగా డాటర్‌ స్థానంలో మేఘా ఆకాశ్..!

124
Niharika

కోలీవుడ్‌లో స్వాతిని దర్శకత్వంలో అశోక్ సెల్వన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి హీరోయిన్ గా ముందుగా మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారికను ఎంపిక చేశారు. అయితే, నిహారికకు ఇటీవలే నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె పెళ్లిపీటలు ఎక్కునుంది. ఈ నేపథ్యంలో, సదరు చిత్రంలో నటించలేనని చిత్ర నిర్మాతకు నిహారిక తెలిపింది. దీంతో, ఆమె స్థానంలో మేఘా ఆకాశ్ ను ఎంపిక చేశారు.

దీనిపై నిర్మాత సెల్వకుమార్ స్పందిస్తూ..‌ ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్ర విభిన్నంగా ఉంటుందన్నారు. అందుకే తొలుత నిహారికను ఎంచుకున్నామన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ పాత్రకు హీరోయిన్‌ మేఘా ఆకాశ్‌ సరిగ్గా సరిపోతుందని దర్శకురాలు పేర్కొన్నారు. ఆ పాత్రకు మేఘా సరిపోతుందనిపించి వెంటనే ఆమెను సంప్రదించి కథను వివరించామన్నారు. తనకు కూడా కథ నచ్చడంతో ఒకే చెప్పిందన్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌ను ఖరారు చేసి వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాత పేర్కొన్నారు.