రాజకీయాల్లో తమ కుటుంబం తప్ప వేరే ఎవరు రాణించలేరని తేల్చేశాడు సినీ నటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. పైసా వసూల్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలయ్య నోరు జారాడు. రాజకీయాలలోకి చాలా మంది సినీ ప్రముఖులు వస్తున్నారు.. వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరిని మీరు రాజకీయాల్లోకి ఆహ్వానిస్తారా అని బాలయ్యని యాంకర్ ప్రశ్నించింది.
దీనికి సమాధానం ఇచ్చిన బాలయ్య తానెవరికి రాజకీయాల్లోకి రావాలని పిలుపునివ్వనని …రాజకీయాల్లో రాణించడం తమ కుటుంబానికే చెల్లిందన్నారు. పనిలో పనిగా బిగ్ బి అమితాబ్, చిరంజీవిపై సెటైర్లు వేశాడు. రాజకీయాల్లోకి వచ్చి అమితాబ్ ఏం పీకాడన్న బాలయ్య …ఒక మంచి నేతను ఓడించి పార్లమెంట్‌లో ఆటోగ్రాఫ్, ఫోటోలు ఇవ్వాడానికి పనికొచ్చాడు తప్ప ప్రజా సేవ చేసింది ఏముంది అని ప్రశ్నించాడు. చిరంజీవి ఏం చేశాడు…ఒక్క ఎన్టీఆర్ తప్ప రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వారు లేరని అది రాసిస్తానని చెప్పుకొచ్చాడు.
అంతేగాదు పాలిటిక్స్ తమ వంశ రైట్స్ అన్నట్లు మాట్లాడిన బాలయ్య మేమే వేరు మా వంశం వేరు అంటు గొప్పలు చెప్పుకునే ప్రయత్నంచేశాడు. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
గతంలో ఆడియో వేడుకలో మహిళల గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేసి చిక్కులు కొనితెచ్చుకున్న బాలయ్య…ఇటీవల వరుసగా సహనాన్ని కొల్పోతూ అభిమానులపై చేయి చేసుకుని వార్తల్లో నిలిచారు. తాజాగా బిగ్ బి అమితాబ్, మెగాస్టార్ చిరంజీవి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.