జగమంత కుటుంబం నాది..:పవన్

226
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా వస్తున్న అభినందనల నేపథ్యంలో పవన్ తన ట్విట్టర్  ద్వారా  స్పందించారు. దేవుడు తనకు జగమంత కుటుంబాన్ని ఇచ్చాడని  .. ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని ట్విట్ చేశారు. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, మద్దతు, దయ ఇలాగే కొనసాగాలి. నేను పుట్టినరోజు వేడుకను జరుపుకోను. కానీ, ఈ వేడుకను మీరందరూ జరుపుకుంటున్నారు.  ‘నేను నిజంగా ఇంతటి ప్రేమకు అర్హుడినా?’ అని నేను అంతర్ముఖంగా ప్రశ్నించుకున్నాని వరుస ట్వీట్లు చేశారు.

ఐదుగురు కుటుంబసభ్యులు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను, దేవుడు ఆశ్చర్యపరుస్తూ జగమంత కుటుంబాన్ని ఇచ్చాడు పేర్కొన్నారు.  ప్రతీ సంవత్సరం తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండే పవన్ ఈ ఏడాది అదే సంప్రదాయాన్ని పాటించాడు.

మరోవైపు శుక్రవారం పార్టీ డిజిటల్ విభాగంతో హైదరాబాద్‌లో ముఖాముఖి నిర్వహించిన పవన్… జనసేన డిజిటల్‌ బృందానికి ఆయన ‘శతఘ్ని’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన పవన్  జైల్లో పెట్టిన ప్రత్యేకహోదాపై ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. నేను భారతీయుణ్ని… ఫలానా ప్రాంతం, కులం మతం ఆధారంగా మాట్లాడటం ఇష్టంఉండదన్న పవన్ తెలంగాణలో ఎవరు పిలిచినా వెళతానని వారికి తెలిపారు.

pawan on his birthday

- Advertisement -