గతేడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ ‘ధమాకా’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సినిమాతో రవితేజ సోలో హీరోగా 100 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకున్నాడు. సినిమాలో రవితేజ కేరెక్టర్ కి , మాస్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో సినిమా ఎవరూ ఊహించని రెవెన్యూ తెచ్చిపెట్టింది.
ఇక తాజాగా ధమాకా సినిమా చూసిన మెగా స్టార్ చిరు ధమాకా దర్శకుడు త్రినాద్ రావు నక్కిన అలాగే రైటర్ ప్రసన్న ను ఫోన్ ద్వారా అభినందించాడట. అంతే కాదు చిరు త్రినాద్ రావు కి తన కోసం ఓ మాస్ కథ రెడీ చేయమని చెప్పారని తెలుస్తుంది. గతంలో చిరుకి ప్రసన్న ఓ కథ వినిపించాడు. కానీ ఆ సినిమా సెట్ అవ్వలేదు. ఇప్పుడు చిరు మళ్ళీ ఆఫర్ ఇవ్వడంతో ప్రసన్న దర్శకుడు త్రినాద్ రావు మెగా కథ సిద్దం చేసే పనిలో ఉన్నారని సమాచారం.
ప్రస్తుతం హీరోగా జోరు పెంచి సినిమాలు చేస్తున్న చిరు భోలా శంకర్ తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మరి త్రినాద్ రావు , ప్రసన్న అదిరిపోయే స్టోరీతో చిరును మెప్పిస్తే వీళ్ళకే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఇవి కూడా చదవండి..