చిరు 157..మూవీ అప్‌డేట్!

16
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్‌లో ఇది 157వ సినిమా కాగా ఈ సినిమాలో హీరోయిన్స్‌గా అనిల్ రావిపూడి నయనతార, కేథరీన్ త్రేసాను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో వెంకటేష్ అతిధి పాత్ర పోషించనుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తీర్చిదిద్దబోతున్నారు.

మే 22 నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానుండగా ప్రస్తుతం యుకె టూర్‌లో ఉన్న చిరంజీవి తిరిగి ఇండియాకి రాగానే చిత్ర యూనిట్‌తో సమావేశం కానున్నాడట. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్‌తో పాటు ఓ సాంగ్ షూట్‌తో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Also Read:త్రివిధ దళాలతో రాజ్‌నాథ్ భేటీ!

- Advertisement -