పహల్గాం దాడులకు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది. పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. పాకిస్థాన్ రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపింది. దీంతో లాహీర్లోని గగనతల రక్షణ వ్యవస్థ నిర్వీర్యం అయినట్లు భారత సైన్యం గురువారం ప్రకటించింది.
ఈ నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కలక సమావేశం నిర్వహించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తోనూ సమావేశమయ్యారు రాజ్‌నాథ్. గురువారం రాత్రి భారత సైన్యం దాడిలో పాక్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం కాగా ఇందుకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు ఆర్మీ అధికారులు.
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం, శనివారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. పాక్ చొరబాట్లను బీఎస్‌ఎఫ్ దళాలు సమర్ధవంతంగా అడ్డుకుంటుండగా రాజస్థాన్‌లోని రామ్‌గర్, జైసల్మేర్‌లోని బీఎస్‌ఎఫ్ క్యాంపులపై దాడికి పాక్ యత్నించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో పౌరుల వాహనాలే లక్ష్యంగా పాక్ దాడులు చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి నిన్న రాత్రి పాక్‌కు చెందిన 50 డ్రోన్లు కూల్చివేసింది భారత్. ఉధంపూర్, సాంబా, జమ్ము ప్రాంతాల్లో డ్రోన్లు కూల్చివేసింది భారత సైన్యం.
Also Read:కేటీఆర్..ఖమ్మం టూర్ షెడ్యూల్

