Pawan:వీరమల్లుకు పొలిటికల్ టచ్?

18
- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు‌‌.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్‌పై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉండగా రెండు రోజుల క్రితమే సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

సినిమాలో పవన్ నుంచి కొన్ని పొలిటికల్ పంచులు కూడా వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం.. పదవుల కోసం నమ్మిన ధర్మాన్ని మార్చుకునే మనిషిని కాను అనే పవర్‌ఫుల్ డైలాగ్ ఉండబోతుందని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరికొన్ని డైలాగ్స్‌ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also Read:TTD:12న ప‌త్ర పుష్పయాగం

- Advertisement -