ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో ఉంటూ వస్తోంది మంచు ఫ్యామిలీ. ముఖ్యంగా మనోజ్ .. విష్ణు మధ్య గొడవలే కాదు బహిరంగంగానే సవాళ్లు విసురుకోవడం, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు వరకు కూడా వెళ్లింది వీరి ఫ్యామిలీ గొడవ.
అయితే మంచు ఫ్యామిలీలో గొడవ సంగతి పక్కన పెడితే భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నాడు మనోజ్. మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌లో రిలీజ్ కానుంది. అలాగే తేజా సజ్జా హీరోగా తెరకెక్కుతున్న ‘మిరాయ్’ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు మనోజ్.
ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలపై ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మనోజ్. 90ఎంఎల్ చిత్ర దర్శకుడు శేఖర్ రెడ్డి చెప్పిన కథ నచ్చడంతో మనోజ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెళ్లడించనున్నట్లు తెలుస్తోంది.
Also Read:TTD:12న పత్ర పుష్పయాగం

