నాగబాబు-వర్మ వార్‌…స్పందించిన చిరు

179
Chiru about Varma - Nagababu Controversy
- Advertisement -

ఖైదీనెంబర్150…. చిరంజీవి హీరోగా… ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ జనవరి 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే, జనవరి 7 న మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరు దగ్గర్లోని హాయ్ ల్యాండ్ లో చిరంజీవి ప్రసంగం అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఐతే వేడుక అయ్యాక చిరు ప్రసంగం కంటే నాగబాబు ప్రసంగమే చర్చనీయాంశం అయింది. ఆర్జీవీ… యండమూరి వీరేంద్రనాథ్ లపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

ఈ కామెంట్స్‌ పై యండమూరి తనదైన శైలీలో స్పందించగా…ఆర్జీవీ మాత్రం నాగబాబును ట్విట్టర్ వేదికగా కడిగిపారేస్తున్నాడు. అంతేగాదు వరుణ్ తేజ్‌కి సైతం సలహాలిసు…నాగబాబు మాటలను పట్టించుకోవద్దంటు చురకలంటించాడు. వర్మ..నాగబాబు మధ్య వార్ ఇంకా జరుగుతునే ఉండగా….తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ గొడవపై స్పందించారు. ఎప్పట్లాగే ఆయన వివాదాలకు తావులేకుండా డిప్లమాటిగ్గా మాట్లాడేసి వివాదాన్ని ముగించే ప్రయత్నం చేశారు.

వర్మ మాటలను తానసలు పట్టించుకోనని తెలిపాడు. అయితే నాగబాబు మాత్రం వర్మ వ్యాఖ్యలపై నోచ్చుకుని స్పందించి ఉండొచ్చని….దీనిపై తానేమీ స్పందించనని వెల్లడించాడు. రామ్ గోపాల్ వర్మతో తనకు ఎలాంటి ఇబ్బందులూ లేవని.. అతడితో తనకు మంచి స్నేహం ఉందని చిరంజీవి తెలిపాడు. రామ్ చరణ్ వ్యక్తిగతంగా పవన్ ను ఆహ్వానించాడని.. ఐతే తనకు పని ఉండటం వల్ల రాలేకపోతున్నానని పవన్ చెప్పాడని చిరు మరో ప్రశ్నకు సమాధానంగా వెల్లడించాడు. ఐతే పవన్ తమ సినిమాకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసిన విషయాన్ని చిరు గుర్తు చేశాడు. అందరూ ప్రతి వేడుకకూ రావాలనేమీ లేదని చిరు ఈ వివాదానికి కూడా ముగింపు పలికే ప్రయత్నం చేశాడు.

- Advertisement -