సెక్సీ లుక్‌తో సెగలు పుట్టించింది….

250
Priyanka Chopra's Golden Globes 2017 Dress
- Advertisement -

సినిమాల్లో శృంగారం మితిమీరిపోతోంది. హాలీవుడ్ మూవీస్ లో అయితే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మన తారలు కూడా రొమాన్స్ లో వాళ్లకు ఏం తీసిపోవడంలేదు. ఇంకా కాస్త డోస్ పెంచే యాక్ట్ చేస్తున్నారు. సినిమా వేషాలకోసం మొదట్లో కొందరు ఏ రకంగానైనా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతారు. కానీ…బాగా పేరున్న హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా అందాల్ని ఆరబోస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ మధ్య మరింత అందాల ఆరబోతకు దిగింది.

Priyanka Chopra's Golden Globes 2017 Dress

బాలీవుడ్‌ అందాల తార ప్రియాంక చోప్రా కాలిఫోర్నియాలో 74 వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవంలో తన అందాలను ఆరబోసింది. రెడ్ కార్పెట్ పై ఓ మెరుపు మెరిసింది. రాల్ఫ్ లారెన్ గౌన్ లో ధగధగలాడింది. నెక్ పీస్ డ్రస్ తో హాట్ హాట్ గా సెగలు పుట్టించింది. రెడ్ కార్పెట్ లో హాలీవుడ్ స్టార్స్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో సెక్సీగా కనిపించింది. అక్కడున్న కుర్రకారును మత్తెక్కించింది.

Priyanka Chopra's Golden Globes 2017 Dress

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా యూఎస్‌ టెలివిజన్ విభాగంలో అందజేసే గోల్డెన్ గ్లోబ్-2017 అవార్డు కార్యక్రమానికి హాజరైంది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ సీజన్‌లో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం అవార్డ్సు ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఆమె వాఖ్యతగా హాజరయ్యారు. గోలియాత్‌కు గాను (డ్రామా) కేటగిరీలో బెస్ట్ టీవీ యాక్టర్ గా బిల్లీ బాబ్ థార్న్‌టాన్ నిలిచాడు. ప్రియాంక చోప్రా అంతర్జాతీయ అవార్డ్సు ప్రదాన కార్యక్రమానికి ప్రజెంటర్‌గా హాజరవడం ఇది మూడోసారి.

Priyanka Chopra's Golden Globes 2017 Dress

అమెరికా టీవీ సీరియల్ క్వాంటికోలో నటిస్తున్న ప్రియాంక ఇప్పటికే హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గత ఏడాది జరిగిన ఆస్కార్ ప్రదానోత్సవంలో కూడా ఆమె అవార్డును అందజేసింది. నిన్న మొన్నటివరకూ హాట్ భామలుగా సన్నీలియోన్ ని, పూనం పాండేని చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా ఈలిస్ట్‌లో చేరిపోయారంటూ నెటిజన్లు సెటైర్లే వేస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం బేవాచ్ కూడా ఈ ఏడాది రిలీజ్ కానుంది.

- Advertisement -