కళింగ ఆర్ట్‌ క్రియేషన్స్‌ ‘సంభవం’….

117

‘చిరుసైన్యం’ ఫేం సాగర్‌ హీరోగా, స్వప్నిక హీరోయిన్‌గా కళింగ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై సీనియర్‌ దర్శకులు నండూరి వీరేష్‌ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్‌ నెం. 3’ చిత్రం ‘సంభవం’. ఈ చిత్ర ప్రారంభోత్సవం జనవరి 9న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆత్మీయ అతిథుల‌ మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సల‌హాదారుడు విద్యాసాగర్‌రావు, ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత బాబా భాయ్‌, నటులు ఆవుల‌ వీరశేఖర్‌ యాదవ్‌, హీరో సాగర్‌, హీరోయిన్‌ స్వప్నిక, దర్శకులు నండూరి వీరేష్‌, చిత్ర నిర్మాత గూన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Sambhavam Movie Opening

పూజా కార్యక్రమాల‌ అనంతరం హీరో సాగర్‌, హీరోయిన్‌ స్వప్నికపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ప్రభుత్వ సల‌హాదారుడు విద్యాసాగరరావు క్లాప్‌నివ్వగా, మాజీ ఎంపీ ఆవుల‌ వీరశేఖర్‌ యాదవ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సన్నివేశానికి ప్రముఖ వ్యాపారవేత్త బాబా భాయ్‌ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణ‌ ప్రభుత్వ సల‌హాదారుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ` ‘‘మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే చిత్రమిది. కథ విని చాలా ధ్రిల్‌ అయ్యాను. దర్శకుడు వీరేష్‌ చాలా అద్భుతమైన కథ, మాటలు సమకూర్చారు. డెఫినెట్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల‌ మన్ననల‌ను పొందుతుంది. గూన అప్పారావు మంచి ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్‌ అవుతుంది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

Sambhavam Movie Opening

చిత్ర నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ ` ‘‘కళింగ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో ‘ల‌వ్‌ స్పాట్‌’, ‘గురుబ్రహ్మ’ చిత్రాల‌ను నిర్మించాం. అవి త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. మళ్లీ మా బ్యానర్‌లో మూడో చిత్రంగా ‘సంభవం’ చిత్రాన్ని ప్రారంభించాం. సాగర్‌, స్వప్నిక జంటగా నటిస్తున్నారు. వీరితోపాటు ఓ ప్రముఖ హీరో, హీరోయిన్‌ నటిస్తున్నారు. మర్డర్‌, మిస్టరీ నేపథ్యంలో డిటెక్టివ్‌ నవలల‌తో చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా సాగే కొత్త తరహా చిత్రమిది. వీరేష్‌ ముప్పై సంవత్సరాల‌ అనుభవం ఉన్న దర్శకుడు. ఈ సినిమాకి నిర్మాతగా చేస్తున్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు నుండి రెగ్యుల‌ర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తున్నాం. మళ్లీ జనవరి 20 నుండి ఫిబ్రవరి 5 వరకు మరో షెడ్యూల్‌ చేస్తాం. దాంతో పాటలు మినహా టాకీ పూర్తవుతుంది. డాడీ శ్రీనివాస్‌ ఐదు మంచి ట్యూన్స్‌ కంపోజ్‌ చేశారు. మా టీమ్‌ అంతా కలిసి ఒక మంచి హిట్‌ సినిమా తీయడానికి కృషి చేస్తున్నాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Sambhavam Movie Opening

దర్శకుడు నండూరి వీరేష్‌ మాట్లాడుతూ ` ‘‘రీసెంట్‌గా రమ్యకృష్ణగారితో ‘జగన్మాత’ అనే సినిమా చేశాను. ఇది నా ఐదవ సినిమా. హర్రర్‌, మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్‌తో పాటు అనేక ట్విస్ట్‌ల‌తో ప్రేక్షకులు ధ్రిల్ ఫీల‌య్యే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రముఖ హీరోతో పాటు ఒక పెద్ద హీరోయిన్‌ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. బిగ్‌ ప్యాడిరగ్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు.

హీరో సాగర్‌ మాట్లాడుతూ ` ‘‘చిరుసైన్యం’ చిత్రంలో హీరోగా యాక్ట్‌ చేశాను. ఇది నా రెండో సినిమా. వీరేష్‌గారు చెప్పిన సబ్జెక్ట్‌ చాలా డిఫరెంట్‌గా కొత్తగా అనిపించింది. హీరోగా నాకు ఈ చిత్రం మంచి ప్లస్‌ అవుతుంది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని ఇచ్చిన వీరేష్‌గారికి, అప్పారావుగారికి నా థాంక్స్‌’’ అన్నారు.

Sambhavam Movie Opening

హీరోయిన్‌ స్వప్నిక మాట్లాడుతూ ` ‘ల‌వ్‌స్పాట్‌’ ‘గురుబ్రహ్మ’ చిత్రాల్లో లీడ్‌ క్యారెక్టర్స్‌ చేశాను. ఇది థర్డ్‌ ఫిలిం. ఎవరూ ఊహించని మ‌లుపుల‌తో ఈ చిత్రం ఉంటుంది. డిఫరెంట్‌ కథాబ‌లం ఉన్న చిత్రాల‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాగే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ క్యారెక్టర్‌కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందరూ అప్రీషియేట్‌ చేసేలా నటిస్తాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతల‌కు నా థాంక్స్‌’’ అన్నారు.

ప్రముఖ వ్యాపారవేత్త బాబా మాట్లాడుతూ ` ‘‘ఇంతకు ముందు రొమాంటిక్‌ టార్గెట్‌ అనే చిత్రాన్ని నిర్మించాను. గూన అప్పారావు, వీరేష్‌గారు సబ్జెక్ట్‌ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయ్యాను. సస్పెన్స్ ద్రిల్ల‌ర్‌తో పాటు ఇన్వెస్టిగేషన్‌తో సాగే చిత్రమిది. ఆడియన్స్‌కి ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా ఇది’’ అన్నారు.

Sambhavam Movie Opening

ప్రముఖ హీరో, హీరోయిన్‌లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, శివాజీరాజా, సుమన్‌శెట్టి, చిట్టిబాబు, ‘జబర్దస్త్‌’ అప్పారావు, అమిత్‌, అశోక్‌కుమార్‌, జూ. రేలంగి, అల్ల‌రి సుభాషిణి, ఢిల్లీ రాజేశ్వరి, శ్రీదేవి, దేవిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు, సంగీతం: డాడీ శ్రీనివాస్‌, కెమెరా: నాగబాబు కర్రా, ఎడిటింగ్‌: శ్రీనుబాబు, ఆర్ట్‌: రామకృష్ణ, కాస్ట్యూమ్స్‌: తిరుమల‌, నిర్మాత: గూన అప్పారావు, కథ – స్క్రీన్‌ప్లే – మాటలు – దర్శకత్వం: నండూరి వీరేష్‌