చరిత్రను తీయడమంటే మాటలు కాదు !

244
chiranjeevi's Uyyalawada Narasimhareddy
chiranjeevi's Uyyalawada Narasimhareddy
- Advertisement -

ఖైదీ నెంబర్ 150 హిట్ తర్వాత నెక్స్ట్ సినిమాలపై దృష్టి సారించాడు మెగాస్టార్ చిరంజీవి. 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కథతో సినిమా తెరకెక్కనుండగా ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.ఈ సినిమాని తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మిస్తుండగా.. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసేసుకున్నారు కూడా. అయితే.. 170 ఏళ్లకు పూర్వం చరిత్రను ఈ సినిమా కోసం ఆవిష్కరించనున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అసలు ఈ మూవీలో మెగాస్టార్ లుక్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. కచ్చితంగా అప్పటి కాలానికి తగినట్లుగా మెగాస్టార్ రూపం మారాల్సిందే. అందుకోసం మెగాస్టార్ కోసం తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.

ఈ సినిమా గురించి మెగాస్టార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. జరిగిన చరిత్రను సినిమాగా తీయడమంటే మాటలుకాదు. దర్శకుడు సురేందర్ రెడ్డి చాలా రీసెర్చ్ చేసి మంచి స్క్రీన్ ప్లే రాశారు’ అన్నారు. అలాగే ఈ చిత్రానికి భారతదేశ స్థాయిలో మార్కెట్ చేసే సత్తా ఉందని, ఈ చిత్రంలో హీరోయిన్ గా కొందరి పేర్లు అనుకున్నామని, కానీ ఇంకా ఎవర్నీ ఖరారు చేయలేదని, ఈ ప్రాజెక్ట్ కోసం జాతీయ స్థాయి నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని ఎంచుకుంటున్నామని అన్నారు.

Chiranjeevi-Uyyalawada-Narasimha-Reddy-Bio-Pic-Pre-Look-1490105084-1181

ఇకపోతే రీసెంట్‌గా మెగా లుక్ కి సంబంధించిన ఓ పోస్టర్‌.. నెట్ లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది. ఈ లుక్ ను ఫైనల్ అని చెప్పలేం కానీ.. ఉయ్యలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి ఈ లుక్ కి మాత్రం మంచి స్పందన వస్తోంది

- Advertisement -