అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్ , రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా `దేశంలో దొంగలు పడ్డారు`. సారా క్రియేషన్స్ పతాకంపై. రూపొందింది. గౌతమ్ రాజ్‌కుమార్ దర్శకుడు. రమా గౌతమ్ నిర్మాత. శాండీ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. సినిమా ప్రమోషన్‌లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ని మెగాస్టార్ చిరంజీవి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
ఇటీవలె సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో శ్రీకాంత్ సాంగ్‌ని విడుదల చేశారు. సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. దర్శకుడు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఇదొక క్రైమ్ థ్రిల్లర్. హ్యూమన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథను తెరకెక్కించామన్నారు.
గిరిధర్, జబర్దస్త్ రాఘవ, వినోద్, తడివేలు తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు.జి.రెడ్డి, కళ: మధు రెబ్బా, సమర్పణ: అలీ,ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికుమార్ పాలకుర్తి, సహ నిర్మాతలు: సంతోష్ డొంకాడ, సెలెబ్.