నేను ఫెయిల్..తమ్ముడు పాస్‌!

88
chiranjeevi
- Advertisement -

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో తాను ఫెయిల్ అయ్యానని కానీ తన తమ్ముడు పవన్ పాస్ అయ్యారని తెలిపారు. భవిష్యత్‌లో పవన్‌కు మద్దతిస్తానేమో అంటూ వ్యాఖ్యానించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మాట్లాడిన చిరు..తాను చదువుకున్న కళాశాలలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయని తెలిపారు.

పవన్‌ స్థాయిని ప్రజలే నిర్ణయిస్తారని.. పవన్ లాంటి నిబద్ధత కలిగిన నాయకులు రావాలంటూ ఆకాంక్షించారు. పవన్ మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నానని చెప్పారు. తాను పాలిటిక్స్ నుంచి ఎగ్జిట్ అయి సైలెంట్‌గా ఉన్నానని స్పష్టం చేశారు. తామిద్దరం రాజకీయంగా చెరోవైపు ఉండటం కంటే.. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడమే పవన్‌కు హెల్ప్ అవుతుందేమోనని చిరు తెలిపారు.

ప్రజా రాజ్యం పార్టీని 2008లో ఆగష్టులో సార్వత్రిక ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు స్థాపించారు. అన్ని స్ధానాల్లో పోటీచేయగా చిరుకు 18 స్ధానాలు దక్కాయి. ఇక మెగాస్టార్ రెండు స్ధానాల్లో పోటీచేయగా ఓ స్థానంలో ఓడిపోయారు. తర్వాత తన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి రాజ్యసభ సభ్యుడై మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో పర్యాటక శాఖ స్వతంత్ర శాఖ మంత్రిగా యేడాదిన్నకు పైగా బాధ్యతలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -