చిరంజీవి ఆసుపత్రి నిర్మాణం ఎక్కడో తెలుసా…!

141
chiranjeevi
- Advertisement -

ఒక నటుడిగా తనకు చాలా గుర్తింపు వచ్చిందన్నారు దానికి కారణం అభిమానులేనని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. కానీ ఆ అభిమానం సంపాదించుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో ప్రత్యక్షంగా, పరోక్షంగా….నా ఎదుగదలకు కారణమైన సినీ కార్మికులకు కోసం ఏమైనా చేయాలనే అలోచనలో ఉన్నప్పుడు తన తండ్రి కొణిదెల వెంకట్రావు పేరుతో చిత్రపురి కాలనీలో ఒక ఆసుపత్రి నిర్మాణం ఏర్పాటు చేయాలని అలోచించాం. అనుకున్న వేగంతో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాదికల్లా పూర్తి చేసి సేవలు అందించేలా చూస్తానని మాటిచ్చారు. ఈ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఎంతో మంది ముందుకు రావడం అభినందనీయమన్నారు.

హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో సెలెబ్రిటీ క్రికెట్‌ కార్నివల్ కార్యక్రమంకు చీఫ్‌ గెస్ట్‌ గా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఏ కు చేందిన ట్రోఫీని జెర్సీలను చిరంజీవి ఆవిష్కరించారు. ఇటీవల నేషనల్‌ అవార్డ్‌ సాధించిన ఎస్‌ఎస్‌ థమన్‌ని సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ఎంతోమంది తమ్ముళ్ల ప్రేమని పొందుతున్న తాను చాలా అదృష్టవంతుడనని క్రికెట్‌ ఆడుతూ పదిమందికి సేవ చేస్తున్న వారికి అభినందనలు తెలిపారు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు అంటుంటారు. అలాగే ఆపదలో ఉన్నవాళ్ళకి సహాయం అందించే గుణం కూడా ఉండాలని సూచించారు.

తృప్తి లేనివారికి మానసిక శాంతి కూడా ఉండదని…తాను స్వయంగా అనుభవించి చెబుతున్నట్లు తెలిపారు. ఎక్కడైతే తృప్తి లేదో అక్కడ సంతోషం కూడా ఉండదన్నారు. కష్టాల్లో ఉన్నవాడి ఆకలి తీర్చినప్పుడువచ్చే ఆనందం అది అంతా ఇంతా కాదు. దాన్ని మాటల్లో వర్ణించలేమన్నారు. అదెలా ఉంటుందో అనుభవ పూర్వకంగా నేను తెలుసుకున్నా మొదట్లో నేను కూడా విలాసవంతమైన కార్లు కొనాలి విదేశీ ప్రయాణాలు చేయాలి. నాకుటుంబ సభ్యలకు అన్ని విధాలుగా సుఖమైన జీవితాన్ని అందించాలనుకున్నా అందుకోసం ఎంతో శ్రమించా పారితోషికం పెరుగుతూ వచ్చింది. ఇంతటి అభిమానాన్ని అందించిన ప్రేక్షకులకు ఏదైనా చేయాలనే భావన కలిగింది. అలా సేవా కార్యక్రమాల్లో భాగమయ్యా. అందుకే బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించా, ఇప్పుడు ఆసుపత్రి నిర్మాణం మొదలు పెట్టిన వచ్చే యేడాది నాటికి ఈ ఆసుపత్రి సేవలు అందించేలా ప్రయత్నం చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్‌ తరుణ్‌ ప్రకాశ్‌రాజ్‌ తమన్‌ సుధీర్‌ బాబు పలువురు పాల్గోన్నారు.

- Advertisement -