Mega 157: క్రేజీ అప్‌డేట్

10
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్‌లో ఇది 157వ సినిమా కాగా చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. ముస్సోరిలో సెకండ్‌ షెడ్యూల్‌ జరుగుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

ఈ సెకండ్‌ షెడ్యూల్‌లోనే చిరు నయనతారపై సాంగ్‌ని కూడా డైరెక్ట్‌ చేయబోతున్నారు అనిల్ రావిపూడి. ఇందుకు కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ స్పెషల్‌ బీట్స్‌ని రెడీ చేసినట్లు తెలుస్తోంది.విక్టరీ వెంకటేశ్‌ గెస్ట్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో కేథరిన్‌ ట్రెస్సా మరో హీరోయిన్‌గా నటిస్తోంది.

Also Read:3 గంటలు గాల్లోనే..ప్రయాణీకుల ఆందోళన!

- Advertisement -