- Advertisement -
వరుస విమాన ప్రమాద ఘటనలు ప్రయాణికులను ఆందోళన కలిగిస్తున్నాయి. లండన్ వెళ్తూ 3 గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయికి వచ్చింది ఎయిర్ ఇండియా విమానం. ఇవాళ ఉదయం 5:39 నిమిషాలకు ముంబయి ఎయిర్‌పొర్ట్ నుండి లండన్ బయల్దేరింది AIC 129 విమానం.
మూడు గంటలు గాల్లో ఉండి తిరిగి ముంబయి ఎయిర్‌పొర్ట్‌కు వచ్చింది విమానం. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పచ్చిమాసియా ప్రాంతాల్లో పలు చోట్ల గగనతలాలపై ఆంక్షలు విధించారు.
ఇరాన్ గగనతలం మూసివేయడంతో పలు విమానాలను దారి మళ్లించారు. వరుస ఘటనలతో విమాన ప్రయాణికులు ఆందోళనలో ఉండగా AIC 129 విమానం తిరిగి రావడంతో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
Also Read:క్షతగాత్రులను పరామర్శించిన మోదీ..
- Advertisement -

