జర్నలిస్టు కొమ్మినేనికి బిగ్ రిలీఫ్…

6
- Advertisement -

సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుకు బిగ్ రిలీఫ్ లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి ఎలంటి సంబంధం లేదని …ఆయనను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

విడుదలకు సంబంధించిన నిబంధనలను మాత్రం ట్రయల్‌ కోర్టు చూసుకుంటుందని తెలిపింది. ఓ టీవీ ఛానల్‌లో నిర్వహించిన చర్చ సందర్భంగా అమరావతి రాజధానిపై జర్నలిస్టు కృష్ణంరాజు అసభ్య వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి.

దీంతో కొమ్మినేనితో పాటు, జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి టీవీ యాజమాన్యంపైనా కేసు నమోదు చేశారు.

Also Read:GIC:హరిత సేనలో చిన్నారి జాహ్నవి

- Advertisement -