ఈ జనరేషన్ లో సోషల్ మీడియాలో అకౌంట్లు లేని వారు ఉంటారా..? ఆ ఛాన్సే లేదు. దాదాపుగా ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాతో కనెక్ట్ అయ్యే ఉన్నారు. అంతేనా..? వారి అభిప్రాయాల్ని కూడా ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. ఇకపోతే..ఆ షేర్ చేసుకునే విషయాలకు మాత్రం హద్దూపద్దూ లేకుండా పోతోంది. ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నారు. అయితే వారి కామెంట్ల వలన అవతల వారు ఎంతగా హర్టు అవుతున్నారో వారు తెలుసుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే..సమంతకు రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే అమ్మాయిగా చిన్మయి అందరికీ సుపరిచితురాలే. సామ్ కి డబ్బింగ్ చెప్పడం వల్ల చిన్మయి కూడా టాలీవుడ్ లో బాగానే ఫేమస్ అయింది. అయితే ఈమె ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. రకరకాల విషయాలపై తన ఒపీనియన్ చెబుతుంటుంది. అప్పుడప్పుడు డిబేట్లు కూడా చేస్తుంటుంది.
అయితే అలాంటి సమయాల్లో చిన్మయికి చాలానే వార్నింగులు వస్తున్నాయట. కొందరు రేప్ చేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తే.. కొందరు యాసిడ్ పోస్తామని.. తన గొంతును మూగబోయేలా చేస్తామంటూ ఆమెను నీచంగా హెచ్చరిస్తున్నారు. ఇదే విషయంపై ట్విట్టర్ వారికి కంప్లయింట్ కూడ చేసిందట చిన్మయి. ఈ విషయంపై ట్విట్టర్ వారు పెద్దగా పట్టించుకోవట్లేదట.
అందుకే ఇప్పుడు రేప్ చెయ్యడం నాట్ ఓకె.. #RapeThreatsNotOk.. అంటూ చిన్మయి ఒక ఆన్ లైన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇక ఎక్కువమంది ఈ క్యాంపెయిన్ కు సపోర్టుగా నిలిస్తే.. ట్విట్టర్ పై ప్రెజర్ తీసుకొచ్చి.. అలాంటి రేప్ హెచ్చరికలను జారీ చేసినవారి అకౌంట్ ను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయొచ్చన్నమాట. అది ఈ చిన్మయి ప్లాన్. మరి ఈ ప్లాన్ కి ప్రాక్టికల్ గా ఎంతమంది సపోర్ట్ ఇస్తారో చూడాలి.