“శబరిమల” వివాదం, “మీటూ”పై రజినీ స్పందన

287
- Advertisement -

శబరిమల ఆలయ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూపర్ స్టార్ రజనీకాంత్ సూచించారు. శబరిమల వివాదంపై స్పందించిన ఆయన.. సుప్రీంకోర్టు తీర్పును అందరూ గౌరవించాలన్నారు. ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి ఆలయ సంప్రదాయాలకు, ఆచారాలకు కూడా మనం గౌరవం ఇవ్వాలని రజినీ కోరారు.

ఇక దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న “మీటూ” ఉద్యమంపై కూడా రజనీకాంత్ స్పందించారు. “మీటూ” ఉద్యమం చాలా గొప్పదని.. ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే ఈ ఉద్యమాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని.. దుర్వినియోగం చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన ఆరోపణలపై కూడా రజని స్పందించారు. వైరముత్తు తనపై వచ్చిన ఆరోపణలను ఖడించారని.. ఇలాంటి సంఘటనలు జరగలేదని చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపారని రజినీ కాంత్ వెల్లడించారు.

 

ఇదిలా ఉంటే.. డిసెంబర్ 12 తన పుట్టిన రోజు సందర్బంగా తన రాజకీయ పార్టీ పేరును ప్రకటిస్తారన్న వార్తలపై కూడా రజిని క్లారిటీ ఇచ్చారు. పార్టీకి సంబంధించిన పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని.. అయితే సమయం వచ్చినప్పుడు పార్టీ పేరును తానే వెల్లడిస్తానని ఆయన స్పష్టం చేశారు. డిసెంబర్ 12న పార్టీ పేరును ప్రకటిస్తారని తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఈ క్రమంలో అలాంటి వార్తల్లో నిజం లేదని రజినీ తేల్చి చెప్పారు.

- Advertisement -