- Advertisement -
టోక్యో ఒలింపిక్స్‌లో ఖాతా తెరిచింది చైనా. తొలి గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది చైనా. శనివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో చైనాకు చెందిన యాంగ్ కియాన్ గోల్డ్ మెడల్ గెలిచుకుంది.
చివరి వరకూ హోరాహోరీగా సాగిన ఈ ఈవెంట్‌లో రష్యా షూటర్ అనస్తేసియా గలేషినా సిల్వర్‌తో సరిపెట్టుకోగా…లాస్ట్ షాట్ లో అనస్తేసియా గలేషినా అధిగమించి చైనా అమ్మాయి యాంగ్ కియాన్ గోల్డ్ గెలిచేసుకుంది. ఒలింపిక్ రికార్డ్ స్కోరు అయిన 251.8 సాధించడం విశేషం.
ఈ ఒలింపిక్స్‌లో ఇండియాకు మెడల్ ఆశలు రేపిన గేమ్స్‌లో షూటింగ్ కూడా ఒకటి. కానీ తొలి ఈవెంట్‌లోనే తీవ్రంగా నిరాశపడ్డారు మహిళా షూటర్లు. ఎలవనిల్ వలరివన్, సీనియర్ అపూర్వి చండీలా ఇద్దరూ ఫైనల్‌కు క్వాలిఫై కూడా కాలేకపోయారు.
- Advertisement -