ముక్కోటి వృక్షార్చన..లక్ష్యాన్ని చేరుకుంటాం: ఎంపీ సంతోష్

127
mp santhosh

ముక్కోటి వృక్షార్చన కార్యక్రమలో భాగంగా చేపట్టిన మూడు కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు ఎంపీ సంతోష్ కుమార్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేరోజు మూడు కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఎనిమిదవ ఇంక్లైన్ అబ్దుల్ కలాం స్టేడియంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులతో కలిసి ఒకే చోట పదివేల మొక్కలు నాటారు.

అనంతరం మాట్లాడిన సంతోష్ కుమార్.. కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం తీసుకున్నాం… పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజు మూడు కోట్ల మొక్కలు నాటి లక్ష్యం చేరుకుంటామనే రిపోర్ట్ లు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నాయి…రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటుతున్న నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలకు పేరు పేరునా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

కోల్ బెల్ట్ ఏరియాలో పచ్చదనం పెంచేందుకు సింగరేణి చేస్తున్న కృషి అమోఘం అని కొనియాడారు సంతోష్ కుమార్. ఒక్క రామగుండంలోనే ఇవాళ ఐదు లక్షల మొక్కలు నాటేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే కోరికంటి చందర్ కి ప్రత్యేక అభినందనలు తెలిపారు. యాదాద్రి మోడల్ (మియావాకి) లో తక్కువ ప్రాంతంలో ఎక్కువ మొక్కలు నాటి చిట్టడవులు పెంచవచ్చన్నారు.