ఒలింపిక్స్‌…చైనా కీలక నిర్ణయం

161
china
- Advertisement -

ఫిబ్రవరి 4వ తేది నుండి చైనాలోని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ గేమ్స్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఒమిక్రాన్,కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది చైనా. కరోనా కేసులు బయటపడుతున్న చోట కఠిన లాక్ డౌన్ అమలు చేస్తుండగా ఒలింపిక్స్ నాటికి పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

అయితే ఇందులో భాగంగా ఒలింపిక్స్‌లో విదేశీ ప్రేక్షకులకు అనుమతిలేదని చెప్పిన చైనా…తాజాగా దేశీయ ప్రేక్షకులకు అనుమతి లేదని వెల్లడించింది. ఈ వింట‌ర్ ఒలింపిక్స్‌కు ప్రేక్ష‌కులకు అనుమ‌తి లేద‌ని, ప్రేక్ష‌కులు లేకుండానే ఒలింపిక్స్‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పింది. వివిధ దేశాల నుంచి వ‌చ్చే క్రీడాకారుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చైనా తెలియ‌జేసింది.

- Advertisement -