బుక్ చేసుకున్న 2 గంటల్లోనే గ్యాస్ సిలిండర్….

126
indane gas
- Advertisement -

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. ఇకపై బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే గ్యాస్ సిలిండర్‌ ఇంటికి రానుంది. ఈ సదుపాయాన్ని ప్ర్యతేకంగా తీసుకొచ్చింది ఇండేన్ గ్యాస్.

ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఇండేన్ గ్యాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా గ్యాస్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్ పొందవచ్చని అయితే కస్టమర్లు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. హైదరాబాద్‌లో మొత్తం 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉండనుందని తెలిపింది.

- Advertisement -