అధికారం కోసం ‘జీ’ కొత్త ప్లాన్‌..

212
- Advertisement -

తన అధికారం చేజారకుండా పక్కా ప్రణాళికలు రూపొందిస్తున్నారు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్. అందుకోసం ఓ కొత్త ప్లాన్ ని కూడా వేశారాయన. చైనా అధ్యక్ష పదవిలోనే శాశ్వతంగా కొనసాగేందుకు పావులు కదుపుతున్నారు జి జిన్‌పింగ్‌.

ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీపై పట్టు సాధించారు. అయితే ప్రస్తుతం రెండోసారి ఆ దేశ అధ్యక్షుడిగా కొనసాగుతున్న జి జిన్‌పింగ్‌ పదవీకాలం మరికొద్ది రోజుల్లో పూర్తవనుంది.

China pushes back against criticism of plan for Xi to stay in power

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా వ్యవస్థాపకుడు మావో సె టుంగ్ తర్వాత దేశంలో అత్యంత శక్తిమంతమైన నేత హోదాను పొందిన జీ జిన్‌పింగ్ తన పదవిని శాశ్వతం చేసుకునే దిశగా అడుగులేస్తున్నారు. చైనాలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఎవరైనా కేవలం రెండుసార్లు మాత్రమే కొనసాగుతారు. రిపబ్లిక్ ఆఫ్ చైనా ఆవిర్భావం నుంచీ ఇదే నిబంధన అమలవుతోంది.

అయితే ఇప్పుడు తొలిసారిగా ఈ నిబంధనను పక్కన పెట్టి 64 ఏళ్ల వయసున్న ప్రస్తుత అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆ దేశ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకోనున్నారు. ఇదే జరిగితే కేవలం దేశాధ్యక్షుడిగానే కాదు అంతకంటే శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా జనరల్ సెక్రెటరీగా కూడా శాశ్వతంగా ఆయనే కొనసాగనున్నారు.

కాగా..రాజ్యాంగ సవరణ ద్వారా మార్చి 5న ప్రారంభ‌మయ్యే పార్ల‌మెంటు స‌మావేశాల్లో మ‌రోసారి జీ జిన్‌పింగ్ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన్నిక అయ్యే అవ‌కాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఈ మార్పు తప్పదని భావించి క‌మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఈ నిర్ణ‌యానికే మొగ్గుచూపిందని భావిస్తున్నారు విశ్లేష‌కులు.

- Advertisement -