చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులు ప్రేమించుకోవడానికి సెలవులిచ్చింది.చైనాలో తొమ్మిది కాలేజీల్లో విద్యార్ధులకు ప్రేమలో పడండీ అంటూ సెలవులు మంజూరు చేసింది ఏప్రిల్ 1 నుండీ 7 వరకు ప్రేమించుకోవాలని లవ్ హాలీ డేస్ ప్రకటించింది.
విద్యార్ధులు ప్రకృతిలో విహరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందనీ..దీంతో వారు పాఠాలను చక్కగా అర్థం చేసుకుని వారి భవిష్యత్తును బంగారు బాటగా మలచుకోవాలని తెలిపింది. అయితే ఇది కేవలం విద్యార్ధుల భవిష్యతు కోసమే కాదని చైనాలో అత్యంత దారుణంగా పడిపోతున్న జననాల రేటు పెంచుకోవటానికే.
ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే రాయితీలూ ఇస్తోంది చైనా. 1980 నుంచి 2015 వరకు చైనాలో ఒక బిడ్డ ఒక విధానమే ఉండేది. ఇది అప్పట్లో పెను సంచలనాత్మక నిర్ణయమే అయినా అప్పటి పరిస్థితులు ఆ విధానాన్ని అవలంభించాల్సి రావటంతో ఆ నిర్ణయం ప్రభావం ఇప్పుడు చైనా జననాల రేటుపై తీవ్రంగా పడింది. మరీ ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి పుణ్యమా అని ఈ సమస్య మరింతగా పెరిగింది.ఈ నేపథ్యంలో యువతి ప్రేమలో పడితే వివాహాలు చేసుకుంటారు..పిల్లల్ని కంటారనే ఆశాభావంతో ఇటువంటి వినూత్న నిర్ణయం తీసుకుంది చైనా ప్రభుత్వం.
ఇవి కూడా చదవండి..