Thalapathy Vijay:ఇన్‌స్టాలోకి విజయ్

46
- Advertisement -

తమిళ స్టార్ హీరో విజయ్‌ సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. actorvijay అనే పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు.  లియో సినిమా సెట్స్ లో దిగిన ఓ ఫోటోని షేర్ చేశారు విజయ్. అలాగే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా ఓ ఫోటోని పోస్ట్ చేశాడు.

లియో షూట్ సమయంలో కాశ్మీ మంచులో దిగిన ఫొటోని పోస్ట్ చేశాడు విజయ్. ఈ అకౌంట్ ని విజయ్ స్టాఫ్ మెయింటైన్ చేయబోతున్నారు. మొదటి ఫోటో పోస్ట్ చేసి తమిళ్ లో నా స్నేహితులందరికీ హలో అని పోస్ట్ చేశారు.

ఇక విజయ్ ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన గంటన్నరలో 1 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్నారు. మూడు గంటల్లో 2 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. ఇక హాఫ్ డేలో 3.7 మిలియన్స్ ఫాలోవర్స్ విజయ్ ని ఇన్‌స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -