ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కన చిత్రం ఆదిపురుష్. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల తిరుమలలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించగా చిత్రయూనిట్ శ్రీవారిని దర్శించుకుంది.
దర్శనం అనంతరం కృతి సనన్ వెళ్లిపోతున్నా సమయంలో ఓం రౌత్ ని కౌగిలించుకోవడం, ఓం రౌత్ ఆమెకు ముద్దు ఇవ్వడం వివాదానికి కేరాఫ్‌గా మారింది.దీనిపై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:స్కిన్ అలర్జీ సమస్యలకు చక్కటి చిట్కా!
స్వామివారి శేష వస్త్రాలు ధరించి కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటి పనులు చేయడం తన మనసుకి ఆందోళన కలిగించిందన్నారు. తిరుమల కొండ పై అటువంటి వికారమైన చేష్టలు చేయకూడదని, అది శాస్త్ర సమ్మతం కాదని చెప్పుకొచ్చారు. తిరుమల కొండకు వచ్చినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. భార్యాభర్తలు సైతం వారి ఆలోచనా విధానంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.