- Advertisement -
ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఒక డిప్యూటీ కమాండర్ సహా 6 మంది నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో ఒక మహిళా నక్సలైట్ మృతదేహం కూడా ఉంది.
బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో చీపుర్‌భట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. హతమైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్,కోబ్రా, CRPF అధికారులు పరిస్థితిని పర్యవేక్షించారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.
Also Read:IPL 2024 :ముంబైతో హైదరాబాద్ ఢీ!
- Advertisement -