IPL 2024 :ముంబైతో హైదరాబాద్ ఢీ!

28
- Advertisement -

నేటి ఐపీఎల్ లో మరో ఆసక్తికరమైన పోరు కు తెరలేవనుంది. ఉప్పల్ వేధికగా ముంబై ఇండియన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు రాత్రి 8 గంటలకు తలపడనున్నాయి. తొలి మ్యాచ్ లలో ఓడిపోయిన ఈ రెండు జట్లు రెండో మ్యాచ్ లో కచ్చితంగా గెలవలనే పట్టుదలతో ఉన్నాయి. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ స్వల్ప తేడాతో ఓటమి చవిచూసింది. 207 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించేలా కనిపించింది కానీ ఓటమి తప్పలేదు. ఇక ముంబై ఇండియన్స్ విషయానికొస్తే 2013 నుంచి కూడా తొలి మ్యాచ్ ఓటమితోనే ప్రారంభిస్తుంది. ఈ సీజన్ కూడా అలాగే ప్రారంభించిన ముంబై.. రెండో మ్యాచ్ తోనైనా గెలుపు బాటా పట్టాలని చూస్తోంది. ప్రస్తుతం రెండు జట్లు కూడా పటిష్టంగానే ఉన్నాయి. .

దాంతో ఏ జట్టు విజయం సాధిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (46), రచన్ రవీంద్ర (46), శివం దూబే (51) పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో గుజరాత్ 8 వికెట్లు కోల్పోయి 143 పరుగుల వద్దే నిలిచింది. దాంతో చెన్నై 63 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయం తో చెన్నై వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి. మరి నేడు జరిగే మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించి పాయింట్ల పట్టికలో స్థానాన్ని మెరుగు పరచుకుంటాయో చూడాలి.

Also Read:ఏప్రిల్ 17 నుండి ఒంటిమిట్ట‌ బ్ర‌హ్మోత్స‌వాలు

- Advertisement -