ktr:చేసింది గోరంత..చేయాల్సింది కొండంత:కేటీఆర్‌

42
- Advertisement -

జీహెచ్‌ఎంసీ పరిధిలోని లేక్‌లను అన్ని రకాల అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని చెరువులను అభివృద్ధి చేసి కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ది చేయాలని నిర్ణయించినట్టు కేటీఆర్‌ అన్నారు. సీఎస్‌ఆర్‌ ( కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ ) నిధులతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని 25, హెచ్‌ఎండీఏ పరిధిలోని 25 చెరువుల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు ఒప్పంద ప‌త్రాల‌ను కేటీఆర్ అందించారు.

జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలో 155 చెరువులు ఉన్నాయి. దుర్గం చెరువు అభివృద్ధి చెందిన త‌ర్వాత టూరిస్టులు అధికంగా వ‌స్తున్నారు. సినిమా షూటింగ్‌లు కూడా చాలా అయ్యాయి. ఇటీవ‌ల హైద‌రాబాద్ సంద‌ర్శించిన ప్ర‌ముఖులు విదేశాల్లో ఉన్నామా అని ఆశ్చర్య‌పోతున్నారు. ఆఫీస్ స్పేస్ ఆక్యుపేష‌న్‌లో దేశంలోనే హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎంతో కృషి చేస్తే త‌ప్ప ఇంత అభివృద్ధి జ‌ర‌గ‌దు. ప్ర‌పంచానికే వ్యాక్సిన్ క్యాపిట‌ల్‌గా హైద‌రాబాద్ మారింది. ఫార్మా సిటీ ప్రారంభ‌మైతే ప్ర‌పంచ ఫార్మా న‌గ‌రంగా మారుతుంది. శాంతిభ‌ద్ర‌త‌లు, ప‌రిపాల‌న బాగుండ‌టం వ‌ల్లే భారీగా పెట్టుబ‌డులు వ‌చ్చాయన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఐకానిక్ భ‌వ‌నాలు వస్తున్నాయన్నారు.

రెండు, మూడేండ్ల‌లో శంషాబాద్ మెట్రో లైన్ పూర్తి చేస్తమన్నారు. కేటీఆర్ ప్ర‌క‌టించారు. ల‌క్డీకాపూల్ – బీహెచ్ఈఎల్, నాగోల్ – ఎల్బీన‌గ‌ర్ రూట్ల‌లో మెట్రోకు కేంద్రం సాయం కోరాం. ఆ రెండు రూట్ల‌లో ఫీజ‌బులిటీ లేద‌ని కేంద్రం లేఖ రాయ‌డం దుర్మార్గం. మ‌నం క‌ట్టే ప‌న్నుల్లో కూడా మ‌న‌కు కేంద్రం మొండి చేయి చూపిస్తోందని మండిపడ్డారు. హైద‌రాబాద్‌లో మెట్రో లైన్ 250 కిలోమీట‌ర్ల‌కు విస్త‌రిస్తాం. ఇప్ప‌టి వ‌ర‌కు చూసిన అభివృద్ధి గోరంత‌.. చేయాల్సింది చాలా ఉంది అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

KTR:ఫ్లై ఓవ‌ర్ల కింద క్రీడా వేదిక‌లు..

harish:నిమ్స్‌లో ఎంసీహెచ్‌ ఆసుపత్రి..!

Harish Rao:మాతా శిశు మరణాలు తగ్గుముఖం

- Advertisement -