పోకిరి రీ-రిలీజ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన చెన్నకేశవరెడ్డి@యూఎస్‌

76
chennakesava
- Advertisement -

ఈ మధ్య టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ సినిమాల హవా కొనసాగుతుంది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల బర్త్‌డే సందర్భంగా బ్లాక్‌బస్టర్‌ విజయాలు సాధించిన పాత సినిమాలను 4కే ప్రింట్‌తో రీ-రిలీజ్‌ చేస్తున్నారు. బాలకృష్ణ- వి. వి వినాయక్‌ కాంబోలో వచ్చిన ‘చెన్నకేశవ రెడ్డి’ అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డ్యూయల్‌ రోల్‌లో బాలకృష్ణ నటనకు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 25నాటికి ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో మేకర్స్ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాను రీ-రిలీజ్‌ చేస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ చిత్రం అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. యూ.ఎస్‌లో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్‌తోనే ఏకంగా 25వేల డాలర్లను వసూళ్లును చేసి.. మహేష్‌ బాబు ‘పోకిరి’ రికార్డును బ్రేక్‌ చేసింది. పోకిరి సినిమా రీ-రిలీజ్‌ టైంలో 15వేల డాలర్లను వసూళ్ చేసింది. ఇక చెన్నకేశవ రెడ్డి చిత్రం కేవలం అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే పోకిరి రికార్డును బ్రేక్‌ చేసిందంటే బాలయ్యకు ఏ రేంజ్‌లో క్రేజ్‌ ఉందో తెలుస్తుంది. ఇదే రేంజ్‌లో దూసుకుపోతే పవన్‌ కళ్యాణ్‌ జల్సా రికార్డు కూడా బ్రేక్‌ అవడం ఖాయం అని నెటీజన్లు భావిస్తున్నారు. జల్సా సినిమా యూ.ఎస్‌ బాక్సాఫీస్‌ దగ్గర మొత్తంగా 37వేల డాలర్లను వసూళ్లును సాధించింది. ఇక ఇప్పటికే చెన్నకేశవ రెడ్డి చిత్రం 25వేల డాలర్లను వసూళ్లును సాధించింది. మరో 12వేల డాలర్లను సాధిస్తే జల్సా రికార్డు బ్రేక్‌ అయినట్లే. ఇక ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో 300లకు పైగా థియేటర్లలో రీ-రిలీజ్‌ చేస్తున్నారు.

- Advertisement -