ఆదివారం జరిగిన ఐపిఎల్ ఫైనల్ లో ముంబై విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నై సూపిర్ కింగ్ పై ముంబై ఇండియన్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో చివరి వరకూ చెన్నై గెలుస్తుంది అని అందరి ఉహించగా…వాట్సన్ అవుట్ కావడంతో ముంబై విజయం సాధించింది. అయితే ఈమ్యాచ్ పట్ల పలు రకాల అనుమానాలకు తావిస్తుంది. ముంబై చెన్నై టీం లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ పలువురు విశ్లేషకులు ఆరోపణలు చేస్తున్నారు.
చివరి వరకూ వచ్చిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. తాజాగా చెన్నై ఓడిపోవడంతో ఓ అభిమాని ఫుల్ గా ఏడ్చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం ఉండగా అతను అవుట్ అయ్యాడు. దీంతో ఇంట్లో మ్యాచ్ చూస్తున్న నాటౌట్ నాటైట్ అంటే ఏడ్చేశాడు. కాసేపు ఇంట్లో చిందరవందరగా చేశాడు. తల్లి తండ్రులు ఎంత చెప్పినా అతను వినకుండా పడుకునేముందు కూడా అతను బాగా ఏడ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.