రియల్ హాట్ స్పాట్ గా హైదరాబాద్..

388
real estate
- Advertisement -

కార్పొరేట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది హైదరాబాద్. ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా దేశంలోనే బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్‌ వైపు ప్రపంచ కార్పొరేట్ కంపెనీలతో పాటు వివిధ రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరుస్తున్నారు. భాగ్యనగరం గ్రోత్‌లో కీలకపాత్ర పోషిస్తోంది రియల్ ఎస్టేట్. ఆఫీస్‌ స్పేస్ లీజింగ్‌లో దేశంలోనే టాప్‌గా ఉన్న హైదరాబాద్ వరల్డ్ క్లాస్ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌తో పాటు బెస్ట్ సోషల్ ఇన్‌ ఫ్రా స్ట్రక్చర్‌ రంగాల్లో దూసుకుపోతోంది.

ఒకప్పుడు కమర్షియల్ సిటీకి కేరాఫ్‌ బెంగళూరు. కానీ ప్రస్తుతం బెంగళూరుని వెనక్కి నెట్టి మొదటి స్ధానాన్ని సంపాదించుకుంది హైదరాబాద్. ఇతర నగరాలతో పోలిస్తే తక్కువ ధరలకే రెసిడెన్షియల్ ఫ్లాట్లు,ఇళ్లు లభిస్తుండటంతో హైదరాబాద్‌లో రియల్ జోష్ పెరిగిపోయింది. దేశవిదేశాల నుంచి ఐటీ కంపెనీలతో పాటు స్టార్టప్స్ ఇక్కడికి క్యూ కడుతుండటంతో కమర్షియల్ మార్కెట్ పెరిగిపోయింది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి వంటి వెస్ట్రన్ సిటీలో అయితే ఆఫీస్ స్పేస్ కి భారీగా డిమాండ్ పెరిగింది. అంతేగాదు మిగతా నగరాలతో పోలిస్తే తక్కువ ధరలో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ మార్కెట్ ఇక్కడ ఉంది.

టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి బ్లూచిప్ కంపెనీలతో పాటు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, క్యాప్ జెమ్ని వరల్డ్ టాప్ ఐటీ కంపెనీలు హైదరాబాద్ లో తమ తమ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలు, ఉద్యోగులతో ఇక్కడి రెసిడెన్షియల్ మార్కెట్ పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, మార్కెట్ డిమాండ్ ని తీర్చడానికి అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. దీనికి తోడు జైపూర్, పుణె, నాగ్​పుర్ వంటి సిటీలతో పోల్చితే రెసిడెన్షియల్ రేట్లు హైదరాబాద్‌లో తక్కువ. దీంతో ఇతర రాష్ట్రాల వారు సైతం ఇక్కడ నివసించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో,ఔటర్ రింగ్ రోడ్‌ హైదరాబాద్‌ బ్రాండ్‌ను మరింత పెంచాయి. 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ రియల్ఎస్టేట్ జోష్ లో ఉంది. దీంతో ఇక్కడ నివసించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఆసక్తికనబరుస్తున్నారు. మొత్తంగా నాలుగేళ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,టీఎస్‌ఐపాస్‌తో పెట్టుబడులు పెరగడంతో గ్రేటర్‌లో రియల్‌ భూమ్‌ గతంలో ఎన్నడూలేనంతగా పెరిగిపోయింది.

 

- Advertisement -