ఛీ మోడీజీ.. దేశానికి సిగ్గు చేటు !

32
- Advertisement -

బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్ల పై లైంగిక వేదింపులకు పాల్పడుతున్నారంటూ బాధిత మహిళా రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీడా రంగంలో రాణిస్తున్న మహిళలు మన దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపజేస్తూ దేశానికి గర్వకారణంలా నిలుస్తున్నారు. అలాంటి మహిళా క్రీడకారిణిలపై లైంగిక వేదింపులు అనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా దేశంలో ఈ అంశం సంచలనంగా మారింది. బాధిత రెజ్లర్లకు అండగా ప్రజల నుంచి ఇతర నాయకుల వరకు అన్నీ వైపులా నుంచి మద్దతుగా నిలుస్తున్నారు.

బాధిత రెజ్లర్లను న్యాయం జరిగి బ్రిజ్ భూషణ్ సింగ్ పై మోడీ సర్కార్ వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నీ వైపులా నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయితే మోడీ సర్కార్ మాత్రం ఇంతవరకు అతని పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు తనమీద వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని బ్రిజ్ భూషణ్ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు నూతన పార్లమెంట్ ప్రారంబొత్సవం జరుగుతుండగా బాధిత రెజ్లర్లు తీవ్ర ఆందోళనలు చేపట్టి పార్లమెంట్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు.

దీంతో పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో చోటు చేసుకున్నా పరిణామాలు అందరినీ కలచివేస్తున్నాయి. భారత దేశానికి బంగారుపతకాలు సాధించిన రెజ్లర్లు పోలీసుల పాదాల కింద నలగాల్సిన పరిస్థితి. దీంతో మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెళ్లబిక్కుతున్నాయి. దేశానికి వన్నె తెచ్చిన రెజ్లర్ల పై ఇంత దారుణంగా వ్యవహరించడం అత్యంత భాదకరం అని సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. దీంతో మోడీ సర్కార్ పై దుమ్మెత్తిపోస్తూ ” SHAME ( సిగ్గుచేటు ) ” అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నిజంగా ఒకప్పుడు బంగారు పతకాలను దేశానికి అందించిన మహిళా రెజ్లర్లు ఇప్పుడు పోలీసుల పాదాల కింద నలగడం నిజంగా సిగ్గుచేటే.

Also Read: బి‌ఆర్‌ఎస్ గూటికి వలసలు..!

- Advertisement -