కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదు…

311
karthika
- Advertisement -

ప్రముఖ యాంకర్‌ కత్తి కార్తీక పై చీటింగ్ కేసు నమోదైంది. డెవలప్‌మెంట్‌ కోసం తక్కువ ధరకే స్థలం ఇప్పిస్తామని కోటి రూపాయలు నమ్మించి మోసం చేసిన కేసులో కార్తీక సహా ఏడుగురిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది.

ఫిలింనగర్‌లో ఉంటున్న పచ్చిపాల దొరస్వామి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లోని టచ్‌స్టోన్‌ ప్రాపర్టీ డెవలపర్స్‌ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. నగర శివారులో నిర్మాణాలు చేపట్టాలని తనకు స్నేహితుడైన ఆర్కిటెక్ట్‌ శ్రీధర్‌ గోపిశెట్టిని సంప్రదించారు. తర్వాత శ్రీధర్‌…కత్తి కార్తీకను దొరస్వామికి పరిచయం చేశారు.

మెదక్‌ జిల్లా అమీన్‌పూర్‌ గ్రామంలోని సర్వే నంబర్‌ 322, 323, 324, 329లో 52 ఎకరాల స్థలం ఉన్నదని, ఇందులో తామూ కొంతభాగాన్ని కలిగి ఉన్నామని కార్తీకతోపాటు నువ్వాల శివరాంప్రసాద్‌, తన్నేరి భీమ్‌సేన్‌, అందె మురళీకృష్ణ, జాగృత్‌లాల్‌, మోహన్‌ సంతోష్‌ తదితరులు దొరస్వామిని నమ్మించారు. ఈ స్థలాన్ని డెవలప్‌మెంట్‌ కోసం రూ.35 కోట్లకే ఇప్పిస్తామని, ఇందుకు రూ.కోటి సెక్యూరిటీ డిపాజిట్‌గా తమకు ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

దీంతో వారి మాటలు నమ్మిన దొరస్వామి కోటి రూపాయలు ఇచ్చారు. ఎంతకు అగ్రిమెంట్ కాకపోవడంతో మోసపోయానని గ్రహించిన దొరస్వామి బంజారాహిల్స్‌ పోలీసులకు ఆశ్రయించారు.

- Advertisement -