త్వరలో కాంగ్రెస్‌లోకి కత్తీ కార్తీక..!

101
karthika

సినీ నటి కత్తి కార్తీక త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ ని కలిశారు కత్తి కార్తీక. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని కత్తి కార్తీకను ఆహ్వానించగా ఈ ఆఫర్‌ పై కత్తి కార్తీక సుముఖత వ్యక్తం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రచార కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా మధుయాష్కీకి శుభాకాంక్షలు తెలిపారు కార్తీక.

బీసీ మహిళ, తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలైన కత్తి కార్తీకను పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఇండిపెండెంట్‌గా దుబ్బాక ఉప ఎన్నికల్లో కత్తి కార్తీక పోటీ చేసిన సంగతి తెలిసిందే.