- Advertisement -
ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్. బీజేపీ ఆరెస్సెస్ కలిసి దేశంలోని ప్రజల మధ్య మత చిచ్చు పెట్టి ఎన్నికల్లో గెలవడం పరిపాటిగా మారిందని అన్నారు. 40 వేల సంవత్సరాల క్రితం దేశంలో అందరి డీఎన్‌ఏ ఒకేలా ఉండేదని ఆరెస్సెస్ నేతలు చెబుతున్నారని మరి అలాంటప్పుడు పగలు మతద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఆరెస్సెస్ ఛీఫ్ పదవిని ఎప్పుడూ ఒక ప్రత్యేక వర్గంకు చెందిన వ్యక్తులకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.
ఒక దళితుడినిగానీ ఆదివాసీనిగానీ ఎందుకు ఆరెస్సెస్ చీఫ్‌గా నియమించరని బఘేల్ నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బీజేపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. రాష్ట్రంలో బీజేపీ ప్రస్తావిస్తున్న సమస్యలు కొత్తవేమి కావని సీఎం బఘేల్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆటగాళ్లకు ఎస్కార్ట్‌గా ఎఫ్-16…
ఈ పాస్‌వర్డ్స్ వాడుతున్నారా..మీ పని ఖతం?
గుడ్ న్యూస్..ఇక సెల్ ఫోన్‌లోనే టీవీ!
- Advertisement -