ఆటగాళ్లకు ఎస్కార్ట్‌గా ఎఫ్‌-16…

416
- Advertisement -

ప్రపంచంలో అత్యంత మేటి ఆట అయిన ఫుట్‌బాల్‌ ఈసారి మధ్య ఆసియా లో జరుగుతుంది. ఇలా ఈవెంట్‌ జరగడం మొదటిసారి కాగా ఆసియా ఇది రెండో టోర్నమెంట్. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా ఖతార్ చేరుకుంటున్నాయి. ఇక పోలాండ్ జాతీయ ఫుట్ బాల్ జట్టు కూడా ఖతార్ పయనమైంది.

గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ రష్యాల మధ్య జరుగుతున్న వార్‌ వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. దాంతో యూరోప్‌ మొత్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో గత వారంలో యూరోప్‌లో పరిస్థితులు మరింతఘోరంగా మారిపోయాయి. ఇటీవ‌ల పోలాండ్‌లో క్షిప‌ణి దాడి జ‌రిగిన నేప‌థ్యంలో .. అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలు.. ఆ విమానానికి ఎస్కార్ట్‌గా వెళ్లాయి.

ఉక్రెయిన్‌, ర‌ష్యాతో బోర్డ‌ర్ క‌లిగి ఉన్న పోలాండ్‌.. త‌మ ప్లేయ‌ర్లను సుర‌క్షితంగా దేశం దాటించేందుకు అమెరికా సాయం కోరింది. పోలాండ్ ఫుట్‌బాల్ జ‌ట్టుకు చెందిన అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ఎఫ్‌-16 ఎస్కార్ట్ విమానాల వీడియోను పోస్టు చేశారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో గ్రూప్ సీలో పోలాండ్ ఆడ‌నున్న‌ది. మంగ‌ళ‌వారం మెక్సికోతో తొలి మ్యాచ్‌లో ఆ దేశం పోటీప‌డ‌నున్న‌ది.

ఇవి కూడా చదవండి..

బీసీల వ్యతిరేకి బీజేపీ…

ఈ పాస్‌వర్డ్స్‌ వాడుతున్నారా..మీ పని ఖతం?

విశ్వక్‌ సేన్‌ కోసం బాలయ్య…

- Advertisement -