పట్టాలు తప్పిన చార్మినార్..ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

30
- Advertisement -

నాంపల్లి రైల్వేస్టేషన్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం తో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. హైదరాబాద్ ( నాంపల్లి ) నుండి మేడ్చెల్ ( 47244 ) , మేడ్చల్ నుండి నుండి హైదరాబాద్ ( 47251 ) ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ లోని నాంపల్లి రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాం మీదికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయని అధికారులు వెల్లడించారు. రైలు ఇంజన్ ప్లాట్ ఫాం సైడ్ వాల్ ను ఢీ కొట్టిందని… పదిమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.

Also Read:10 నిమిషాలు పరిగెత్తితే..ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -