టాలీవుడ్ టాప్ హీరోలు ఒకరినొకరు కలవడం, ఒకరి సినిమా వేడుకలకు మరొకరు హాజరవడం ఇటీవల సాధారణమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య చక్కటి స్నేహ సంబంధాలు ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోల్లో నందమూరి హీరో ఎన్టీఆర్, మెగా హీరో రామ్ చరణ్ ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ చాలా బలపడింది. రెగ్యులర్గా కలుస్తున్న ఈ రెండు ఫ్యామిలీస్ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇవి చూసిన ఫ్యాన్స్కి ఆనందం అవధులు దాటుతుంది.
అయితే నిన్న జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మెగా హీరో రామ్ చరణ్, ఆయన వైఫ్ ఉపాసన… ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేయించారు. అంతే కాదు గ్రూఫ్ ఫోటోకి కూడా ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను, ఓ చిన్న వీడియోను ఉపాసన తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఎన్టీఆర్ తనయుడిని తన ఒళ్లో కూర్చోపెట్టుకున్న ఉపాసన, రామ్ చరణ్ భుజంపై చెయ్యి వేసిన ఎన్టీఆర్ ఉన్న ఫొటో పోస్ట్ అయిన తరువాత మెగా, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.
ఇక ఎన్టీఆర్ వారసుడు “ఫాలో ఫాలో యూ…” పాట పాడిన వీడియోనూ ఉపాసన పోస్ట్ చేశారు. ఈ పిక్, వీడియో చూడటానికి రెండు కళ్లూ చాలడం లేదంటున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. త్వరలో రామ్చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Tooo tooo cute #followfollowU @tarak9999 #RamCharan pic.twitter.com/K0dszQkrGe
— Upasana Konidela (@upasanakonidela) May 5, 2018