చరణ్ ఉపాసన పెళ్లిరోజు.. విశేషాలు

302
Charan Upasana
- Advertisement -

ఈ రోజు రామ్ చరణ్- ఉపాసన పెళ్లి రోజు. ఇప్పటికి వీళ్ల బంధం మొదలై 8 ఏళ్లు గడిచిపోయింది. 2011 డిసెంబర్ 11న చరణ్‌, ఉపాసనల నిశ్చితార్ధం వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఆరు నెలలకు 2012 జూన్ 14న అంగరంగ వైభవంగా చరణ్ పెళ్లి జరిగింది. ఈ 8 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క గాసిప్ కూడా లేకుండా ఐడియల్ కపుల్ అనిపించుకున్నారు చరణ్ ఉపాసన జోడీ. ఓ వైపు రామ్ చరణ్ తన సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటే.. మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు మోస్తూ, సమాజహిత కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్తా చాటుతోంది ఉపాసన.

అయితే వీరిది ప్రేమ వివాహమని అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరూ ఒకర్నొకరు ఐదేళ్ల పాటు ప్రేమించుకుని ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన పరిచయం ఒక స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగింది. ఆ తర్వాత కలిసిన ప్రతి సందర్భంలో కూడా ఇద్దరూ ఒకర్నొకరు తెలుసుకున్నారు. వాళ్ల మధ్య మొదట్లో గొడవలు కూడా జరిగాయి.. కానీ అవి సరదా గొడవలు మాత్రమే. వాటి వల్లే తమ మధ్య ఇంకా ప్రేమ పెరిగిందని చెప్తుంది ఉపాసన. ఐదేళ్ల పాటు ప్రేమ ఊసులు చెప్పుకున్నారు.. పెళ్లాడాలనుకుంటున్న విషయాన్ని ఇద్దరూ తమ ఇళ్లల్లో చెప్పేసి వాళ్లను ఒప్పించి అనుకున్నది సాధించారు. చరణ్ ఉపాసన పెళ్లిరోజు సందర్భంగా చాలా మంది సినీ తారలు అభిమానులు వారికి విషెస్ అందిస్తున్నారు.

- Advertisement -