హిందువుల పవిత్రయాత్ర చార్‌ధామ్ యాత్ర నేటితో ముగిసిందని కేదార్‌నాథ్ ఆలయ ఆర్చకులు ప్రకటించారు. శీతాకాలంలో ఆలయం మంచులో కూరుకుపోతుందని అందుకే ఆలయంను మూసివేస్తామని అన్నారు. ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పూజారులు గుడితలుపులు మూసివేశారు.
ఆర్మీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో శివయ్య పంచముఖీ దేవతం విగ్రహం శ్రీఓంకారేశ్వరాలయం ఉఖీమఠ్‌కు తీసుకుని వచ్చారు. ఈ సమయంలో హరహర శంభో శంకర అంటూ చూట్టు ప్రక్కల ప్రాంతాల్లో శివనామస్మరణతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు స్వామివారి వెంట నడిచారు. రానున్న 6నెలల పాటు ఉఖిమఠ్‌లో పూజలు నిర్వహించనున్నారు.
కేదార్‌నాథ్‌తో పాటు ఉత్తర కాశీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యమునోత్రి ధామ్ ఆలయం కూడా ఇవాళ మూతపడింది. ఆరు నెలల వరకు ఆలయం మూసి ఉంటుంది. యమునా దేవి గుడిని మధ్యాహ్నం 12.09 గంటలకు అభిజిత్ ముహూర్తంలో సర్వన్ సిద్ధి యోగం కింద మూసివేశారు. చార్ ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు. హిమపాతం, శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా, ఏటా అక్టోబర్-నవంబర్ మాసాల్లో చార్ ధామ్ లు మూసివేసి తదుపరి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు.
ఇవి కూడా చదవండి..