- Advertisement -
హైదరాబాద్‌లో మరో వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ని ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో శంషాబాద్ నుంచి ఎల్బీనగర్ మీదుగా ప్రయాణించడం మరింత సులభతరం కానుంది. అలాగే నల్గొండ, వరంగల్ వెళ్లడం కూడా మరింత సులభం అవుతుంది. మొత్తం రూ.45.79 కోట్లు పెట్టి ఈ వంతెన నిర్మించారు.
2020లో జీహెచ్ఎంసీ ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో విమానాశ్రయం, వరంగల్, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు 10 నిమిషాల సమయం ఆదా అవుతుంది.
- Advertisement -