- Advertisement -
ఫిలింఫేర్ అవార్డులపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డులు ఇవ్వడంలో నిజాయితీ, కనీస విలువలు పాటించని ఇలాంటి అవార్డులకు నేను ఎనిమిదేళ్లుగా దూరంగా ఉంటున్నాను. ఈ అవార్డుని నేను బ్యాన్ చేశాను అని తెలిపింది.
ఇది ఆ సంస్థకి కూడా తెలుసు. ఈ సారి మళ్ళీ తలైవి సినిమాని నామినేషన్స్ లో ఉంచి నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ అవార్డు నాకు రాదు, వాళ్ళు ఇద్దామనుకున్న వాళ్లకి ఇస్తారు, అలాంటప్పుడు నామినేషన్స్ కూడా అనవసరం తనకు ఇష్టం లేకపోయినా ఎందుకు నామినేట్ చేశారని ప్రశ్నించారు కంగనా. ఇష్టంలేని అవార్డ్ ఇచ్చి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ సంస్థ ధోరణిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాను అని వెల్లడించింది.
- Advertisement -

