చంద్రయాన్-3 కోసం ప్రత్యేక పూజలు..

22
- Advertisement -

ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్ – 3 జాబిల్లిని ముద్దాడే క్షణం కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రష్యా ప్రయోగం విఫలం కావడంతో ఇప్పుడు ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3 విజయవంతమయ్యే విధంగా ఆశీర్వదించాలని భగవంతునికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు ప్రజలు.

ఈ నెల 23న జాబిల్లిపై చంద్రచాన్ – 3 అడుగుపెట్టనుండగా విక్రమ్ ల్యాండర్ చంద్రుని నేలను ముద్దాడే క్షణాలను దేశ ప్రజలకు చూపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది ఇస్రో. ఈ ఉద్విగ్నభరిత సన్నివేశాలను ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, డీడీ నేషనల్ టీవీలలో ప్రత్యక్ష ప్రసారం చేయబోతోంది. బుధవారం సాయంత్రం 5.20 గంటల నుంచి ప్రారంభం కానుంది.

Also Read:ఆ ఇద్దరిలో భయం భయం..కమలంలో కంగారు?

షెడ్యూలు ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగు పెట్టనుంది. ఇక ఈ నెల 19న దాదాపు 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా (LPDC) తీసిన చంద్రుని ఫొటోలను షేర్ చేసింది. చంద్రయాన్-3 విజయవంతమైతే జాబిల్లిపై అడుగు పెట్టిన నాలుగో దేశంగా భారత దేశం చరిత్ర సృష్టిస్తుంది.

- Advertisement -