ఆ ఇద్దరిలో భయం భయం..కమలంలో కంగారు?

14
- Advertisement -

మరో మూడు నెలల్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎంత కీలకంగా వ్యవహరిస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని చూస్తోంది, అయితే కొండలాంటి బి‌ఆర్‌ఎస్ ను ఢీ కొట్టి తెలంగాణ ప్రజల మన్ననలు పొందడం కాషాయ పార్టీకి అంతా తేలికైన విషయం కాదు. పైగా బీజేపీ అంటేనే మతతత్వ పార్టీ అనే ముద్రా ప్రజల్లో గట్టిగా నాటుకుపోయింది. ప్రజల్లో నెలకొన్న ఈ అభిప్రాయాన్ని చెరిపి కాషాయ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం పగటి కలె. అయినప్పటికి కమలనాథులు మాదే విజయం అంటూ నిద్ర లేచినది మొదలుకొని కలవరిస్తూనే ఉన్నారు. .

ఇప్పటికే కర్నాటక ఫలితాలతో కంగుతిన్నా కాషాయపార్టీ తెలంగాణలో కూడా అదే రిజల్ట్ ను చవిచూసే అవకాశం లేకపోలేదు. ఇక ప్రస్తుతం అభ్యర్థుల విషయంలో కసరత్తులు చేస్తున్న కాషాయ పార్టీకి ఇద్దరు అధినేతల వైఖరి ఆ పార్టీ అధిష్టానానికి అంతుచిక్కడం లేదట. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు తెలంగాణ మాజీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరియు ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల బరిలోనే నిలవాలని భావిస్తున్నారట. ఇదే ఆ పార్టీ అధిస్థానాన్ని తీవ్రంగా కలవర పెడుతోంది. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ సత్తా చాటలంటే ప్రతి నేత కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలని అమిత్ షా ఇప్పటికే రాష్ట్ర నేతలందరికి స్పష్టమైన అధెశాలిచ్చారు.

Also Read:దొంగ ఓట్లే జగన్ బలమా?

అయినప్పటికి ఈ ఇద్దరు మాత్రం అసెంబ్లీ ఎన్నికల విషయంలో విముఖత చూపిస్తున్నారని టాక్. గత అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి అంబర్ పేట నుంచి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయ్యారు. కానీ ఆ తరువాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్ నుంచి కిషన్ రెడ్డి, అటు కరీంనగర్ నుంచి బండి సంజయ్ లోక్ సభ స్థానానికి గెలుపొందారు. దాంతో ఈసారి కూడా అసెంబ్లీ బరిలో నిలిస్తే ఓటమి తప్పదేమో అనే భయం ఈ ఇద్దరినీ వెంటాడుతోందట. దాంతో సేఫ్ గా పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిస్తే బెటర్ అని ఈ ఇద్దరు భావిస్తునట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కాషాయ పార్టీ అధిష్టానం ఈ ఇద్దరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Also Read:ఆలు పాలతో ఎన్ని ఉపయోగాలో..!

- Advertisement -