వాయిదా పడ్డ చంద్రయాన్-2

281
Chandrayaan 2
- Advertisement -

భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగానికి తాత్కాలికంగా వాయిదా పడింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్టు ఇస్రో తెలిపింది. ప్రయోగానికి సరిగ్గా 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌ‌న్‌ను నిలిపివేసిన ఇస్రో.. ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా నిలిపివేసింది. అనంతరం ప్రయోగాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. వాహక నౌక ‘జీఎస్ఎల్‌వీ మార్క్3’లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయోగం తిరిగి ఎప్పుడు నిర్వహంచేదీ త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

ముందుగా అనుకునట్టు జరిగితే సోమవారం తెల్లవారుజామున 2:51 గంటలకు ఈ ప్రయోగం జరగాల్సి ఉంది. కౌంట్ డౌన్ కూడా పూర్తికావచ్చింది. ప్రయోగం అనుకున్న సమయానికి జరిగి ఉంటే చంద్రయాన్-2 ఈసరికి నిర్ణీత కక్ష్యలో చేరి ఉండేది. ప్రయోగాన్ని మళ్లీ చేపట్టాలంటే అందుకు అనువైన సమయం (లాంచ్ విండో) దొరికితే తప్ప సాధ్యం కాదు. సోమవారం పది నిమిషాల పాటు లాంచ్ విండో అందుబాటులో ఉండడంతోనే ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పుడది నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడన్నది ఆసక్తిగా మారింది. మళ్లీ ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు అనువుగా ఈ నెలలో కేవలం 1 నిమిషం నిడివి ఉన్న లాంచ్‌ విండోలే అందుబాటులో ఉన్నాయి.

Chandrayaan 2

కాగా చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగడం, నీరు, హీలియం-3 జాడను గుర్తించడం చంద్రయాన్-2 ప్రధాన లక్ష్యాలు. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1.. చందమామపై నీటిజాడను గుర్తించిన సంగతి తెలిసిందే. దాన్ని చంద్రయాన్-2 ద్వారా నిర్ధారించాలని, నీరు ఏ రూపంలో? ఎంత మేర ఉన్నదో తేల్చాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ అత్యంత కీలకం. ఆర్బిటార్ చంద్రుడికి 100 కిమీ ఎత్తులో గల కక్ష్యలో తిరుగుతుంటుంది.

అక్కడి వాతావరణం, ఇతర పరిస్థితులను గమనిస్తూ నిత్యం సమాచారాన్ని భూమికి చేరవేస్తుంది. ల్యాండర్.. చంద్రుడి ఉపరితలంపైకి దిగే భాగం. ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాబాయ్ జ్ఞాపకార్థం దీనికి విక్రమ్ అని పేరుపెట్టారు. దీని బరువు 14 కిలోలు. ఇందులోని రోవర్‌కు ప్రజ్ఞ అని పేరుపెట్టారు. ప్రజ్ఞ బరువు 27 కిలోలు. ఈ రెండూ 14 రోజులు చంద్రుడి ఉపరితలంపై పరిశోధించనున్నాయి.

- Advertisement -