విక్రమ్‌ ల్యాండర్‌ లొకేషన్‌ను గుర్తించిన ఇస్రో

351
chandrayaan 2
- Advertisement -

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి క్షణంలో సిగ్నల్స్ కట్ అయిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ సహా శాస్త్రవేత్తలు, యావత్‌ భారతావని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శివన్‌ను ప్రధాని మోదీ స్వయంగా గుండెలకు హత్తుకొని ఓదార్చారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై ఎక్కడుందో గుర్తించినట్లు ఇస్రో చీఫ్‌ శివన్‌ కాసేపటి క్రితమే తెలిపారు.

చంద్రయాన్‌-2 ప్రయోగం ఇంకా విజయవంతంగా కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు మూడు రోజుల్లో కమ్యూనికేషన్‌ జరుపుతామని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం సిగ్నల్‌ వ్యవస్థను రికవరీ చేసే పనిలో పడింది ఇస్రో.

- Advertisement -