ఐపీఎల్ 2025 మధ్యలో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక సంవత్సరం తర్వాత, భారత జట్టు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్… కోహ్లీ రిటైర్మెంట్‌పై మళ్లీ చర్చ మొదలుపెట్టారు. కోహ్లీకి ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని తాను నమ్మినట్లు అశ్విన్ వెల్లడించారు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన అశ్విన్, కోహ్లీ నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణను పంచుకున్నారు. కోహ్లీ చివరి రోజుల్లో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, అతని విలువపై తన నమ్మకం మారలేదని చెప్పారు. నేను నేరుగా అతనికి చెప్పాను — అతనిలో ఇంకా టెస్ట్ క్రికెట్ మిగిలి ఉంది. కానీ భారత్‌లో ఒక సమస్య ఉంది — అది ‘పర్సెప్షన్’ (అభిప్రాయం) అని అశ్విన్ అన్నారు.
కోహ్లీ నిర్ణయం అతని “టీమ్ ఫస్ట్” సిద్ధాంతం వల్లనే వచ్చిందని అశ్విన్ తెలిపారు. విరాట్ ఎప్పుడూ టీమ్ ముందే అన్నాడు. ప్రెస్ మీట్లలో కూడా జట్టు గెలవడం ముఖ్యమని చెప్పేవాడు. ఇలాంటి వ్యక్తి రిటైర్మెంట్ తీసుకుని తిరిగి రావడం చాలా కష్టం. అయినా కూడా అతనిలో ఇంకా క్రికెట్ మిగిలి ఉందని నేను నమ్ముతున్నాను, అని అశ్విన్ చెప్పారు.
కోహ్లీ ..టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవడం IPL 2025 మధ్యలో ప్రకటించడంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. 2011లో అరంగేట్రం చేసిన కోహ్లీ, తన దూకుడు నాయకత్వంతో భారత టెస్ట్ జట్టును పూర్తిగా మార్చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రిటైర్ అయ్యాడు.
Also Read:Shreyas:ఈసారి ట్రోఫీ మాదే!
మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా అశ్విన్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ, కోహ్లీకి ఈ మార్పు అంత ఈజీగా లేదని అన్నారు.విరాట్ కోహ్లీ తన ప్రదర్శనలతో విమర్శకులకు సమాధానం ఇస్తాడు అని కైఫ్ చెప్పారు.

